Hyderabad: భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి చంపిన భర్త.. ఆపై తాను కూడా..

X
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి హత్య చేశాడు భర్త. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు అసోంకు చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కార్‌గా గుర్తించారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన బిశ్వాస్ జీవీకే మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే.. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డైరీలో పేర్కొన్నాడని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
