26 Feb 2021 7:30 AM GMT

Home
 / 
క్రైమ్ / డబ్బులు ఇవ్వలేదని...

డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త

డబ్బులు ఇవ్వాలంటూ రోజూ భార్యను వేధించేవాడు.

డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త
X

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను కడతేర్చాడో భర్త. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం రాళ్లగూడ దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సురేష్‌ అనే వ్యక్తి తాగుడుకు బానిసై.. డబ్బులు ఇవ్వాలంటూ రోజూ భార్యను వేధించేవాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహంతో భార్య తలపై బండరాయితో మోదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు స్వప్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.Next Story