దారుణం.. ప్రేమించి పెళ్లిచేసుకుని భార్యను చంపిన భర్త

X
By - Nagesh Swarna |2 Feb 2021 9:15 PM IST
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండల కేంద్రంలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై ఓ ఇల్లాలు ప్రాణం తీసింది. దీంతో అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. టైలరింగ్ పనిచేసే సూరిబాబు, సుహాసినిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.
భార్యపై అనుమానంతో తరచూ గొడవపడి రెండేళ్లు విడిపోయారు. కుటుంబ పెద్దలు సర్ధిచెప్పడంతో ఆరు నెలలుగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో అనుమానంతో ఉన్మాదిగా మారిన సూరిబాబు భార్య గొంతుకోసి హత్యచేశాడు. తరువాత స్థానిక పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
తీవ్ర రక్తస్రావమై సుహాసిని అక్కడికక్కడే మృతిచెందటంతో.. వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com