Mulugu District: భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తాళ్లతో కట్టేసిన భర్త..

Mulugu District: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఓ భర్త. గ్రామపెద్దల సమక్షంలో ఇద్దర్ని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లిలో జరిగింది. పాయం పురుషోత్తం, చీమల సుమలత ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. సుమలత దొడ్ల గ్రామంలో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.
ఈక్రమంలో పక్క ఊరుకు చెెందిన కారు మెకానిక్ లింగరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య వివాహేతర సంబంధం గురించి ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్న భర్త పురుషోత్తం.. పలుమార్లు నిలదీశాడు. పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా జరిగాయి. అల్లుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమలత తల్లి.. అబండాలు వేయడం కాదు దమ్ముంటే తన కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలంది. దీంతో ఎప్పటి నుంచో భార్య సుమలతను కనిపెడుతూ వస్తున్న పురుషోత్తం.. మరోవ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెెడ్‌గా పట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com