అప్పు తీర్చలేక.. ఆలిని బేరం పెట్టి..

ప్రతీకాత్మక చిత్రం
HusbandSold His Wife: ద్వాపరయుగంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయి ద్రౌపదిని ఒడ్డి ఓడిన చరిత్ర గురించి మనం వినే ఉంటాం. అది ద్వాపరయుగం..కానీ కలియుగంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ భర్త తాను చేసిన అప్పులు తీర్చలేక తన భార్యనే అంగట్లో వస్తువులా భావించి అమ్మేసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని గున ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో పూటగడవడం కష్టం కావడంతో అవసరాలు తీర్చుకునేందుకు తెలిసిన వారి వద్ద నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.
అప్పు తీసుకున్న వ్యక్తికి వడ్డీ భారం పెరిగిపోయింది. అప్పు ఇచ్చిన వాళ్లు సోమ్ము తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. అతడి వద్ద డబ్బులు లేవు. దీంతో తాను ఆ అప్పులు తీర్చలేనని తెలుసుకున్నాడు. లక్ష రుపాయలకు తన భార్యను అమ్ముతున్నట్లు వాళ్లతో బేరం కుదుర్చుకున్నాడు.
అప్పుల వాళ్ల వద్దకు తన భార్యను తీసుకెళ్లి వారికి అప్పజెప్పాడు. అసలు విషయం అప్పుడు ఆమెకు చెప్పాడు. భర్త తనను అమ్మేశాడని తెలుసుకుని షాక్ తిన్నది భార్య. తనను విక్రయించడాన్ని వ్యతిరేకించింది. అక్కడి నుంచి వెళ్లి పోయింది. దీంతో ఆవేశానికి లోనైన భర్త ఆమెను హత్య చేయడానికి యత్నించాడు.
ఇంట్లో నిద్రపోతున్న భార్యను తీసుకెళ్లి బావిలో పడేశాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ మహిళ తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com