Hyderabad: మరోసారి డ్రగ్స్ కలకలం
డ్రగ్స్ పెడ్లర్ భరత్ అరెస్ట్

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. భరత్ అనే డ్రగ్స్ పెడ్లర్‌ను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో దందా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. MDMA డ్రగ్స్‌ను గ్రాము ధర 10 వేల రూపాయలకు భరత్ విక్రయిస్తున్నాడు.
అంబర్‌పేటలో డ్రగ్స్ అమ్ముతుండగా భరత్‌ను నార్కోటిక్ వింగ్, పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద 15 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద డ్రగ్స్ కొంటున్న ఆరుగురు కస్టమర్లను గుర్తించారు. విద్యార్థులు, యువకులు డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని పోలీసుల సూచించారు. పిల్లల కదలికలపై పేరెంట్స్ ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు వెల్లడించారు.
Next Story