Hyderabad : నలుగురు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్

X
By - Vijayanand |14 Feb 2023 3:24 PM IST
డ్రగ్స్ స్మగ్లర్లతోపాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొస్తామన్నారు
హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ను రూపుమాపడానికి త్వరలో టీ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. డ్రగ్స్ స్మగ్లర్లతోపాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొస్తామన్నారు. గతంలో గోవా డ్రగ్స్‌కు అడ్డాగా మారితే ఇప్పుడు ముంబై తయారైందన్నారు.
డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టు బడ్డాయన్న సీవీ ఆనంద్.. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుండి 110 కిలోల గంజాయి, నాలుగు లక్షల విలువైన ఎమ్‌డీఎమ్‌ఏను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com