Hyderabad: ఇంట్లోనే దుకాణం పెట్టేశారు.. పోలీసులు కనిపెట్టేశారు!
Hyderabad

Hyderabad: నగర శివారులో ఇంటినే కాసినోగా మార్చేసి జూదంలో మునిగి తేలుతున్న పేకాట రాయుళ్లకు రాచకొండ- ఆదిభట్ల పోలీసులు ఝలక్ ఇచ్చారు. రావిరాల గ్రామంలో ఓ ఇంట్లో జోరుగా జూదం సాగుతోందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా దాడి చేయడంతో పేకాటరాయుళ్లు పరేషాన్ అయిపోయారు.
ఈ దాడిలో సుమారు రూ.7లక్షల, 15వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటూ మహీంద్రా కారు, 2 మోటార్ సైకిళ్లు, 16 పేకాట సెట్లను కైవసం చేసుకున్నారు.
ఈమేరకు 20 మందిని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు వారిని గున్నాల నీరీక్షణ్, పిల్లి విజయరాజు, పొన్నా జితేందర్, నంబూరి రాజు, కటం జయరామ్, బోయపల్లి ఛత్రపతి, బళ్లారి రాజేశ్వర్, మెతుకుసంత జ్ఞానేశ్వర్, అజ్మా భరత్, కొప్పుల సతీశ్ కుమార్,బండా గోపీ, ఠాకుర్ ముఖేశ్, ధోరంగరి రంగరాజు, సంపంగి రమేశ్, వడ్డే నరసింహ, కట్టానరేందర్, తిరువతి సంపత్ లుగా గుర్తించారు
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై TS అమెండ్మెంట్ యాక్ట్ 2015లోని సెక్షన్ 3,4,5 కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం కోర్టులో వీరిని హాజరు పరచి 14రోజుల రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com