BJP Corporator Arrest : కిడ్నాప్ కేసులో బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్..

BJP Corporator Arrest : హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. క్షేమంగా బయటపడ్డ లంక సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశాడు. తనను కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా చింతపల్లి గుట్టల్లో ఉన్న శివాలయానికి తీసుకెళ్లారని.. నరబలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారని ఆరోపించాడు. ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సకాలంలో స్పాట్‌కు వచ్చి తనను కాపాడారని తెలిపాడు. ఈ వ్యవహారంలో గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డితో పాటు తన సొంత బాబాయి లంక మురళీకృష్ణ, అతని అనుచరులు ఉన్నారని బాధితుడు ఆరోపించాడు.
ఆస్తి తగాదాలే కిడ్నాప్‌నకు కారణమని బాధితుడి తండ్రి లంక లక్ష్మీనారాయణ తెలిపారు. తన కొడుకును చిత్రహింసలు పెట్టారని... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లంక మురళీకృష్ణ 15 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారని అన్నాడు. ఈ కేసులో 15 మంది పాత్ర ఉండగా.. 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఏ1 ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి అని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com