Hyderabad Dancer Murder: హైదరాబాద్‌లో డ్యాన్సర్ దారుణ హత్య.. నగ్నంగా మృతదేహం..

Hyderabad Dancer Murder: హైదరాబాద్‌లో డ్యాన్సర్ దారుణ హత్య.. నగ్నంగా మృతదేహం..
X
Hyderabad Dancer Murder:హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. ఫ‌ల‌క్‌‌నుమా పరిధిలో అనుమానాస్పదస్థితిలో ఓ డాన్సర్‌ మృతి చెందింది

Hyderabad Dancer Murder: హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. ఫ‌ల‌క్‌ నుమా పరిధిలో అనుమానాస్పద స్థితి లో ఓ డాన్సర్‌ మృతి చెందింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృత దేహం నగ్నంగా పడేశారు దుండగులు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్‌ ఫాతిమా కు ఏడుగురు సంతానం. భర్త నదీం చనిపోవడంతో ఆర్కేస్ట్రా ట్రూప్‌ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. మూడ్రోజల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె.. వస్తువులను షిఫ్ట్‌ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్‌ ఉండటంతో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags

Next Story