Hyderabad Drugs: డ్రగ్స్ ఇంటర్నేషనల్ పెడ్లర్ టోనీ నుండి కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు..
Hyderabad Drugs: డ్రగ్స్ ఇంటర్నేషనల్ పెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ మూడవ రోజు విచారణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు రోజులపాటు విచారించిన పోలీసులు.. రెండు రోజుల విచారణలో రాబట్టిన వివరాలు ఆధారంగా.. ఇవాళ విచారణను కొనసాగించనున్నారు. మొదటి రోజు 5గంటల పాటు సాగిన విచారణ, రెండో రోజు 4గంటల పాటు జరిగింది.
టోనీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. అతను వాడిన 10 బ్యాంక్ అకౌంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక ఇబ్బందులతోనే డ్రగ్స్ బిజినెస్‌లోకి వచ్చానన్న టోనీ.. నైజీరియాకు చెందిన వ్యక్తి చెప్పడంతోనే ఇండియాకు వచ్చానన్నాడు. ఇండియాకు వచ్చిన తర్వాత టోనీ.. హైదరాబాద్‌కు ఎన్నిసార్లు వచ్చాడు.. ఎక్కడెక్కడ షెల్టర్ పొందాడు.. బ్యాంక్ లావాదేవీలపై.. పోలీసులు లోతుగా విచారించారు.
ఇప్పటికే బ్యాంక్ టాన్సెక్షన్స్ సేకరించిన పోలీసులు.. వాటి ఆధారంగా ప్రశ్నించారు. టోనీ అండ్ గ్యాంగ్‌కు.. బాబూ షేక్, నూర్ అహ్మద్‌ల నుంచే భారీ మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. మరికొన్ని బ్యాంక్ లావాదేవీలపై వివరాలు రావాల్సి ఉంది. టోనీ.. ఏఏ పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌కి హాజరయ్యాడు అన్న సమాచారంతో ప్రశ్నించారు. బాబూ షేక్, నూర్‌ల నుంచి రిపీటెడ్‌గా ఆడర్స్ తీసుకున్న కస్టమర్లను టోనీ నేరుగా కలిసినట్లు గుర్తించారు.
డ్రగ్స్ తీసుకున్న కస్టమర్ల వివరాలపై ఆరా తీయగా.. తెలియదనే సమాధానం టోనీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ బాయ్‌పై ఆరా తీయగా.. వాట్సాప్ ద్వారా మాట్లాడటమే తప్ప.. నేరుగా ఎప్పుడూ చూడలేనది టోనీ చెప్పాడు. డ్రగ్స్ మాఫియా డాన్‌గా స్టార్ బాయ్.. భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల విచారణలో.. బాబు షేక్, నూర్, ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ వివరాలపైనే ప్రధానంగా పోలీసులు ఆరా తీశారు. విచారణ అనంతరం కొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com