Crime News: హైదరాబాద్‌‌లో తండ్రికొడుకుల దారుణ హత్య..

Crime News: హైదరాబాద్‌‌లో తండ్రికొడుకుల దారుణ హత్య..
X
Crime News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో గాంధీబొమ్మ వద్ద తండ్రికొడుకులను దారుణంగా హత్య చేశారు దుండగులు.

Crime News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో డబుల్‌ మర్డర్‌ కలకలం రేపింది. గాంధీబొమ్మ వద్ద తండ్రికొడుకులను దారుణంగా హత్య చేశారు దుండగులు. మృతులు నరసింహ, శ్రీనివాస్‌గా గుర్తించారు. గొడ్డలితో తండ్రిపై దుండగులు దాడి చేస్తుండగా.. కొడుకు అడ్డువెళ్లాడు. ఇద్దరినీ అత్యంత కిరాతకంగా చంపేశారు దుండగులు. ఉదయం ఐదున్నర సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తనను కూడా కత్తితో బెదిరించారని పనిమనిషి పోలీసులకు తెలిపింది.


స్పాట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గురైన ఇద్దరూ సౌమ్యులని.. ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహపూర్వకంగా ఉండేవారని స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. బ్లూ టీషర్టు వేసుకున్న వ్యక్తి గాంధీబొమ్మ నుంచి మెయిన్‌ రోడ్డు వైపు పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.

Tags

Next Story