IIT Student Suicide : మరో ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..

IIT Student Suicide : మరో ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..
IIT Student Suicide : వారం వ్యవధిలోనే మరో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది

IIT Student Suicide : హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. వారం వ్యవధిలోనే మరో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. సంగారెడ్డిలోని ఓ లాడ్జ్‌ లో దిగిన ఐఐటీ విద్యార్థి మేఘా కపూర్‌... తెల్లవారుజామున లాడ్జ్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో మూడు నెలల కిందట బిటెక్‌ పూర్తి చేసిన మేఘ్ కపూర్‌... ఎంటెక్‌ కోసం క్యాంపస్‌ బయట ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి లాడ్జీలో మూడు నెలలుగా రూమ్‌ తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రాజస్థాన్ లోని మేఘ్ కపూర్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు... ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గతవారం రోజుల్లో ఇది రెండో ఘటన. హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌లో నంద్యాలకు చెందిన రాహుల్‌ గత వారం సూసైడ్‌ చేసుకున్నాడు. ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. రాహుల్‌ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తన కొడుకు ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేశాడు రాహుల్‌ తండ్రి.

Tags

Read MoreRead Less
Next Story