క్రైమ్

ప్రేమను నిరాకరించిందని యువతి ఇంట్లోకి చొరబడి..

హైదరాబాద్ శివారులో ఓ ఉన్నాది రెచ్చిపోయాడు.

ప్రేమను నిరాకరించిందని యువతి ఇంట్లోకి చొరబడి..
X

హైదరాబాద్ శివారులో ఓ ఉన్నాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువతి గొంతు, మణికట్టు కోసి బంధించాడు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఈ ఘటన జరిగింది. తన ప్రేమను ఒప్పుకోవడం లేదంటూ యువతి ఇంట్లోకి చొరబడిన ప్రేమ్‌సింగ్‌ అనే యువకుడు.. యువతి గొంతు, చేతులు, కాలు, మణికట్టు కోసి బంధించాడు. అమ్మాయి అరుపులను గమనించిన స్థానికులు.. ప్రేమ్‌సింగ్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES