చిన్నారిపై అత్యాచార ఘటన.. ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు : పోలీసులు

చిన్నారిపై అత్యాచార ఘటన.. ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు : పోలీసులు
సైదాబాద్‌ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన మృగాడి కోసం పోలీసులు వేటాడుతున్నారు..

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన మృగాడి కోసం పోలీసులు వేటాడుతున్నారు.. నిందితుడి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో పట్టిచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించారు.. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు ప్రకటించారు సీపీ అంజనీకుమార్‌.. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.. ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్ లకి 9490616366, 949061627 చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి మొత్తం 10 బృందాలు దిగాయి. అటు చిన్నారి ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. హంతకుడ్ని పట్టుకుని, ఎన్‌ కౌంటర్‌ చేస్తామంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పర్యటించిన ఆయన... మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారిపై అతి కిరాతకంగా ప్రవర్తించిన మృగాడిని ఎన్‌కౌంటర్‌ చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story