కీచక కామాంధుడు.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ తో పరిచయం.. కోరిక తీర్చాలంటూ..!

కీచక కామాంధుడు.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ తో పరిచయం.. కోరిక తీర్చాలంటూ..!
Hyderabad : అమ్మాయి పేరుతో.... నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేట్‌ చేసి యువతుల్ని మోసం చేస్తోన్న ఓ కామాంధుడిని అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు.

Hyderabad : అమ్మాయి పేరుతో.... నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేట్‌ చేసి యువతుల్ని మోసం చేస్తోన్న ఓ కామాంధుడిని అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో ఉంటూ.. మల్టీమీడియా నేర్చుకుంటున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యువ‌తి ఫోటోతో ఖాతా తెరిచిన అజయ్‌... అమ్మాయిల‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. వారితో క్లోజ్ ఫ్రెండ్‌లా చాట్ చేస్తున్నారు. ఆ తర్వాత... ఫోటోలు పంపించాలంటూ అడుగుతాడు. అమ్మాయే క‌దా అని ఫోటోలు పంపితే... ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు.

న్యూడ్ ఫోటోలు పంపకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఇలా అనేక మంది అమ్మాయిల్ని మోసం చేశాడు అజయ్‌. 15 రోజుల క్రితం ఓ యువ‌తి సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో అజయ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story