Ibrahimpatnam: ముళ్లపొదల్లో పసికందు; కిరాతక తండ్రి నిర్వాకం

Ibrahimpatnam
Ibrahimpatnam: ముళ్లపొదల్లో పసికందు; కిరాతక తండ్రి నిర్వాకం
పురిట్లోనే తల్లిని కోల్పోయిన చిన్నారి; గంటల వ్యవధిలోనే వదిలించుకోవాలనుకున్న కిరాతక తండ్రి; కంటతడి పెట్టిస్తున్న ఇబ్రహీంపట్నం ఘటన

Ibrahimpatnam: ముళ్లపొదల్లో పసికందు; కిరాతక తండ్రి నిర్వాకం


సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారు కొందరైతే, ఆ వరాన్ని కాలుదన్నుకునేవారు మరికొందరు. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదతీరాల్సిన పసికందును ముళ్ల పొదల్లో పడేశాడు ఓ కిరాతపు తండ్రి. ఈ దారుణ ఘటన ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద చోటుచేసుకుంది.


ఎన్టీఆర్ జిల్లాకు చెందిన షాబాజ్ కు, గుడివాడకు చెందిన దివ్యతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. హైదరాబాద్ కలసి జీవిస్తుండగా మొన్నటి వరకూ అంతా సాఫీగానే సాగింది. ఈ క్రమంలో అమ్మాయి గర్భం దాల్చగా ఈ నెల 23న పురిటి నొప్పులు రావడంతో, చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించాడు షాబాజ్. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో దివ్యకు ఫిట్స్ రావడంతో అక్కడిక్కడే మృతి చెందింది.


అంబులెన్స్ లో భార్య మృతదేహాన్ని, బిడ్డను గుడివాడ తీసుకెళుతున్న షాబాజ్ కు మార్గం మధ్యలోనే కిరాతపు ఆలోచన వచ్చింది. పసికందును ఎలాగైనా వదిలించుకోవాలని తలిచాడు. అనుకున్నదే తడువు దొనబండ వద్ద ముళ్లపొదల్లో పసికందును విచక్షనారహితంగా పడేసి వెళ్లిపోయాడు.


అయితే కొంత సమయానికి గాజులమ్ముకుంటున్న మహిళకు శిశువు ఏడుపు వినిపించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె వెళ్లి చూడగా ముళ్ల పొదల్లో రక్తపు మడుగులో పసికందు కనిపించింది. ఈ విషయం గ్రామస్థులకు చెప్పడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టి షాబాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story