Fake Apps: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..

Fake Apps: సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను అమోఘంగా ప్రదర్శిస్తుంటారు.. ఏకంగా గూగుల్ ప్లేస్టోర్ లో నకిలీ యాప్స్ ని సృష్టించి రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే అనేక భద్రతా ప్రమాణాలను కూడా తప్పించుకుని ప్లే స్టోర్ లో ఈ యాప్స్ కనిపించేలా చేస్తున్నారు హ్యాకర్లు. గూగుల్ ఇలాంటి 10 నకిలీ యాప్స్ ని గుర్తించింది. ఇప్పటికే చాలా మంది యూజర్లు ఈ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
గూగుల్ బ్యాన్ చేసిన ఈ 10 యాప్స్ యూజర్ డేటాను దొంగిలిస్తున్నాయని తెలిసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఈ యాప్స్ ని 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్ తెలుసుకోవచ్చని నివేదిక పేర్కొంది. దాంతో పాటుగా ఈ యాప్‌లను ఉపయోగించి ఈ మెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది.
దీంతో యూజర్ల బ్యాంకు వివరాలు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అంతే కాకుండా సందరు యూజరు ఏదైనా OTP లేదా ఇతర వివరాలను కాపీ పేస్ట్ చేసినప్పుడు హ్యాకర్లు ఈ యాప్ ల నుంచి యూజర్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దొంగిలించవచ్చని తెలిపింది. అదనంగా హ్యాకర్లు ఈ యాప్స్ సహాయంతో యూజర్ల వాట్సాప్ ను కూడా యాక్సెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ నిషేధించిన 10 యాప్స్..
స్పీడ్ రాడార్ కెమెరా
AI-Moazin లైట్
Wi-Fi మౌస్
QR & బార్ కోడ్ స్కానర్
Qiibla కంపాస్ - రంజాన్ 2022
సింపుల్ వెదర్ & క్లాక్ విడ్జెట్
హ్యాండ్ సెంట్ నెక్ట్స్ SMS - టెక్ట్స్ విత్ ఎంఎంఎస్
స్మార్ట్ కిట్ 360
ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజెస్ & ట్రాన్స్ లేషన్ ఆడియో
Audiosdroid ఆడియో స్టూడియో DAW
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com