ముకేశ్ అంబానీకి బెదిరింపు కాల్స్.. నిందితుడు తెలంగాణ యువకుడు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని పోలీసులు తెలిపారు. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు కోరుతూ తొలి ఇమెయిల్ రావడంతో పారిశ్రామికవేత్త సెక్యూరిటీ ఇన్‌చార్జి చేసిన ఫిర్యాదు మేరకు ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఇమెయిల్‌లు పంపిన 19 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ వనపర్ధి అనే నిందితుడు తెలంగాణ వాసి. అతడికి నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీ విధించారు.
శనివారం కంపెనీకి రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఇమెయిల్ వచ్చింది. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సైబర్ బృందాలు ఇమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయి.
అంబానీకి, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని పేల్చివేస్తామని కూడా నిందితులు బెదిరిస్తుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com