న్యూజెర్సీలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం హత్య..

న్యూజెర్సీలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం హత్య..
ఐటీ రంగంలో పనిచేస్తున్న భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు హత్య గావింపబడ్డారు. అయితే దీనిని ఆత్మహత్యగా అధికారులు అనుమానించడంతో దీనిపై దర్యాప్తు కోనసాగుతోంది.

ఐటీ రంగంలో పనిచేస్తున్న భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు హత్య గావింపబడ్డారు. అయితే దీనిని ఆత్మహత్యగా అధికారులు అనుమానించడంతో దీనిపై దర్యాప్తు కోనసాగుతోంది. తేజ్ ప్రతాప్ సింగ్ (43), సోనాల్ పరిహార్ (42), వారి 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె, బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ప్లెయిన్స్‌బోరోలోని టైటస్ లేన్ నివాసంలో విగత జీవులుగా పడి ఉన్నారని పోలీసు అధికారులు తెలియజేశారు.

ఇంటి వెలుపల గుమిగూడిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కుంటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సంతోషంగా ఉండేవారని అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో నమ్మలేకపోతున్నామని అన్నారు. భార్యాభర్తలిరువురూ ఐటీ రంగంలో పని చేసేవారని తెలిపారు.

ఇరుగుపొరుగు ఉన్నవారు మరణించిన కుటుంబం గురించి వివరిస్తూ చుట్టు పక్కల వారితో స్నేహపూర్వకంగా ఉండేవారని తెలిపారు. దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో తనకు అనుబంధం ఉందని వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఓ మహిళ వివరించారు.

తన కుమార్తె సాధారణంగా ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు బస్‌స్టాప్‌లో నిలబడుతుంది. అదే సమయంలో సోనాల్ 6 ఏళ్ల కుమార్తె కూడా బస్టాప్ లో కలుస్తుంది. ఈ రోజు బాలిక కనిపించకపోవడంతో ఎందుకు రాలేదో అని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.

ఇంటికి వెళ్లిన తరువాత సోనాల్ కి మెసేజ్ పెట్టాను.. పాప స్కూల్ కి వెళ్లలేదా.. బస్టాప్ లో కనిపించలేదు అని, కానీ సోనాల్ దానికి సమాధానం ఇవ్వలేదు. అప్పటికే ఆ కుటుంబం ప్రాణాలతో లేరని తెలుసుకుని పొరుగింటి మహిళ చాలా బాధపడింది.

Tags

Read MoreRead Less
Next Story