ఇంటర్మీడియెట్ విద్యార్ధినిపై కత్తితో దాడి చేసిన యువకుడు

ఇంటర్మీడియెట్ విద్యార్ధినిపై కత్తితో దాడి చేసిన యువకుడు

విశాఖ జిల్లాలో ఓ యువతి ప్రేమోన్మాదానికి బలైపోయింది. ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్ధినిపై అఖిల్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేసింది. అదే ప్రాంతానికిచెందిన అఖిల్ బీఎల్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి శ్రీనగర్‌ కొండపై సాయిబాబా గుడి వద్ద రామ్‌ అనే యువకుడితో యువతి మాట్లాడుతుంటే అఖిల్‌ అక్కడికి వెళ్లాడు. వీరి ముగ్గురి మధ్య మాటల సందర్భంలో వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. కోపం పట్టలేని అఖిల్‌ తన వెంట తెచ్చిన కత్తితో ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన యువతి రక్తస్రావంతో ఇంటికి చేరుకుంది. కూతురు పరిస్థితిని గమనించిన ఆమెకుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా... మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story