Secunderabad: టీవీ చూడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Secunderabad Crime: తల్లిదండ్రులన్నాక ఆ మాత్రం మందలించకుండా ఎలా ఉంటారు. అస్తమాను టీవీ చూడ్డం ఎందుకు కాసేపైనా చదువుకో అని తల్లి అనడం తప్పొచ్చింది. ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంది. నిండు జీవితాన్ని బలి చేసుకుంది.
ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌లో చోటుచేసుకుంది. తరచూ టీవీ చూస్తుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా శుశృత శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సుశృత (19) ఎక్కువ సమయం టెలివిజన్ చూస్తూ గడుపుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో ఎక్కువ గంటలు టెలివిజన్ చూడటం మానుకోవాలని, చదువుపై దృష్టి పెట్టాలని ఆమె తల్లిదండ్రులు గతంలోనూ కూతురిని హెచ్చరించారు. అయినా పెడచెవిన పెట్టిన సుశృతను మళ్లీ ఒకసారి మందలించారు.
శుక్రవారం తల్లి దూషించడంతో బాలిక గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com