CRIME: ఇంటర్‌ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది..!

CRIME: ఇంటర్‌ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది..!

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో దారుణం జరిగింది. ఇంటర్‌ విద్యార్థిని ఓ ఉన్మాది హత్య చేశాడు. సన్నీ అనే యువకుడు కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి తరచూ నిరాకరిస్తుండటంతో కోపంతో ఊగిపోయిన సన్నీ.... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story