Cyber Crime: ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని దగ్గరై..
Cyber Crime: సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని ఎంత మొత్తుకున్నా.. జరిగే మోసాలకు యువత బలవుతూనే ఉంది. ఆన్‌లైన పరిచయాలు జీవితాలు అంధకారంలో పడేస్తున్నాయి. తాజాగా సూర్యాపేటకు చెందిన ఓ అమ్మాయికి ఫేస్‌బుక్‌లో గుంటూరు చెందిన ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. యువతి గత కొంతకాలంగా విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. 2019లో ఆమెకు రమేష్ అనే యువకుడు ఎఫ్‌బీలో పరిచయమయ్యాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరిగారు.. అంతలోనే ఆమెకు వేరు యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. కానీ ఆ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. అతడితో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో రమేష్ ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
యువతిని తెలిసిన వారింటికి తీసుకెళ్లి దంపతులమని నమ్మించాడు.. రెండు రోజులు వారింట్లోనే ఆశ్రయం పొందారు. ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. రెండు రోజుల అనంతరం యువతిని విజయవాడలో వదిలేసి వెళ్లిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై అత్యాచారం, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com