Hyderabad: పెరిగిన పని ఒత్తిడి.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad: పెరిగిన పని ఒత్తిడి.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Hyderabad: మహమ్మారి రాకతో ఐటీ ఉద్యోగులందరూ వర్క్‌ఫ్రమ్‌ హోమ్ బాటపట్టారు. అయితే ఆఫీస్‌కు వస్తే అన్నా కాస్త రిలీఫ్ ఉంటుందేమో..

Hyderabad: మహమ్మారి రాకతో ఐటీ ఉద్యోగులందరూ వర్క్‌ఫ్రమ్‌ హోమ్ బాటపట్టారు. అయితే ఆఫీస్‌కు వస్తే అన్నా కాస్త రిలీఫ్ ఉంటుందేమో.. ఇంటి నుంచి పని చేసే వారికి నిమిషం ఖాళీ ఉండట్లేదు.. అందునా లే ఆఫ్ పేరుతో సగానికి సగం ఉద్యోగులను తొలగించాయి చాలా సంస్థలు.. దాంతో ఉన్న ఉద్యోగులపై పని భారం అధికమైంది. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందని ఊపిరి పీల్చుకోవడానికి లేదు.. లేటెస్ట్ వెర్షన్స్ మీద పట్టుసాధించాలి. ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. లక్షల్లో జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. భద్రత లేని ఉద్యోగం, పని ఒత్తిడి కారణంగా ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన వినోద్ కుమార్ (32) ఓ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఆయన ఈ మధ్య ఆఫీసుకు రమ్మన్నారని చెప్పి నార్సింగిలో ఉన్న తమ్ముడి ఇంట్లో ఉంటూ ఆఫీసుకు వెళుతున్నారు.

ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో అన్న ఆలోచన ఒకపక్క, మరో పక్క కొత్త టూల్స్‌పై పట్టు సాధించలేకపోవడంతో తరచూ తమ్ముడితో ఇదే విషయమై చర్చించేవాడు వినోద్.. దీంతో తమ్ముడు, అతడి భార్య బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్‌కు భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story