ఎర్రచందనం కేసులో జబర్దస్త్‌ కమెడియన్‌

ఎర్రచందనం కేసులో జబర్దస్త్‌ కమెడియన్‌
జబర్దస్త్‌ కమెడియన్‌ హరి మరోసారి ఎర్రచందనం కేసులో చిక్కుకున్నాడు

జబర్దస్త్‌ కమెడియన్‌ హరి మరోసారి ఎర్రచందనం కేసులో చిక్కుకున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మోరుంపల్లిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి కిషోర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని రెండు కార్లను సీజ్ చేశారు. ప్రధాన సూత్రదారి జబర్దస్త్ కమెడియన్ హరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

జబర్దస్త్ కామెడీ షోలో లెడీ గెటప్‌తో హరి పాపులర్ అయ్యాడు. హరిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం బాకారాపేట సమీపంలోని చీకటిమానుకోన అటవీప్రాంతంలో ఫారెస్ట్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 8 ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ హరి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story