Jaipur : ఓ మంచి దేవుడా... ఈ దొంగను క్షమిస్తావు కదూ..!

చేసింది దొంగతనం.. ఆపై పాపభీతి... పట్టపగలు దొంగతనం చేసేందుకు గుడిలోకి ప్రవేశించాడు ఓ దొంగ. గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడికి దండం పెట్టుకుని వెండి హారాన్ని దొంగలించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. జైపూర్, షాపురా సమీపంలోని మనోహర్ పూర్ పోలీస్టేషన్ సమీపంలోని గోనకాసర్ గ్రామంలోని దేవ్ నారాయణ్ ఆలయంలో బుధవారం దొంగతనం చోటుచేసుకుంది.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ముందుగా దేవుడి ముందు నమస్కరించాడు. ఎవరూలేరని నిర్థారించుకున్నాక.. 3 కిలోల బరువున్న వెండి గొలుసును దొంగిలించాడు. ఈ గొడుకు రూ.2లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. గురువారం ఉదయం పూజారి పూజల నిమిత్తం ఆలయానికి వెళ్లి తలుపులు తెరువగా గొడుగు కనపడలేదు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా చోరీ జరిగిన విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట ఇతనికి ఓ మహిళ కాపలాగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గత 6నెలల్లో దొంగతనం జరగడం ఇది మూడవసారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రతీసారి కొత్త గొడుగు చేయించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్టేషన్ ఎదుట బైఠాయించారు స్థానికులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com