Jammu Kashmir : నకిలీ PMO అధికారి అరెస్ట్

Jammu Kashmir : నకిలీ PMO అధికారి అరెస్ట్
జమ్ము కశ్మీర్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆతిథ్యంతో పాటు, భద్రతను పొందాడు.

ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధికారిగా నటిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు జమ్ము & కాశ్మీర్ పోలీసులు. గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ తాను PMO అధికారినని కేంద్రంలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులను, స్థానికులను నమ్మించాడు. దక్షిణ కశ్మీర్ లోని యాపిల్ తోటల కొనుగోలుదారులను గుర్తించడానికి ప్రభుత్వం తనను నియమించినట్లు పేర్కొన్నాడు. జమ్ము కశ్మీర్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆతిథ్యంతో పాటు, భద్రతను పొందాడు.


శ్రీనగర్ పోలీస్ స్టేషన్ లో కిరణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని పోలీసులు తెలిపారు. కిరణ్ గత సంవత్సరం నుంచి కాశ్మీర్ లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నాడని చెప్పారు. అతను స్థానిక ప్రభుత్వ ఆతిథ్యాన్ని అస్వాదించసాగాడు. విలాసవంతమైన హోటల్ లో గదిని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అరెస్ట్ అయ్యేందుకు ముందు ఉరీలోని కమాప్ పోస్ట్ గుండా, నియంత్రణ రేఖకి దగ్గరగా ప్రయాణిస్తూ శ్రీనగర్ లోని లాల్ చౌక్ కు చేరుకున్నాడు.

మార్చి 2న కిరణ్ ను చీటింగ్, ఫోర్జరీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరుసటి రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీఐపీ కదలికల సమాచారం లేకపోవడంతో మార్చి 2న జమ్ము కాశ్మీర్ విమానాశ్రయంలో నిందితుడిని సీఐడీ గుర్తించింది. ప్రాథమిక నిర్థారణ తర్వాత అతని వద్ద నుంచి నకిలీ గుర్తింపు కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 2న అరెస్ట్ చేయగా విషయాన్ని రహస్యంగా ఉంచారు పోలీసులు. నిందితున్ని కోర్టులో ప్రవేశ పెట్టగా మీడియాకు సమాచారం అందించారు.


Tags

Read MoreRead Less
Next Story