Jangaon: చైన్ స్నాచింగ్‌లో చిన్నారి మృతి.. ఇంతలోనే కేసులో ట్విస్ట్..

Jangaon: జనగామ జిల్లా అంబేద్కర్ నగర్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్నారి తల్లి ప్రసన్న పొంతలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు.. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పసికందుకు సంపులో పడిందని స్థానికులకు చెప్పిన ప్రసన్న.. కాసేపటికే మాట మార్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించిన దుండగుడే పసిపాపను తీసుకెళ్లాడంటోంది. పాపకు పాలు ఇస్తుండగా చైన్‌ను కట్ చేసేందుకు యత్నించాడని చెబుతోంది. అయితే తాను ప్రతిఘటించడంతో.. దుండగుడు పాపను లాక్కుని సంపులో పడేశాడంటోంది. ఈ కేసులో కుటుంబ సభ్యులను అదుపులోని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రసన్న, భాస్కర్ దంపతులకు రెండో సంతానంగా పుట్టిన తేజస్వినికి ఏడాది వయస్సు ఉంది. అయితే పాప ఎదుగుదల లేక అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com