Crime News: అయ్యో రామ ఇంత ఘోరమా.. జీన్స్ ధరించొద్దన్నాడని భర్తని..

Crime News: ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారు.. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు.. కోపంతో ఎదుటి మనిషిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో తెలియట్లేదు. అంతా అయిపోయాక అనుకుని ఏం లాభం. తాజాగా జరిగిన ఓ సంఘటన మనుషులు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పెళ్లయిన తరువాత జీన్స్ ధరించొద్దన్నాడని భర్తని అన్యాయంగా చంపేసింది ఓ భార్య.
జార్ఖండ్ రాష్ట్రం జమ్తారాలోని జోర్భితా గ్రామానికి చెందిన మహిళ పెళ్లి తర్వాత జీన్స్ ధరించడానికి భర్త ఒప్పుకోలేదు. దాంతో ఆమె.. భర్తని కత్తితో పొడిచి చంపేసింది. పుష్ప హెంబ్రోమ్ శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి సమీపంలోని గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతరను చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆమెను భర్త మందలించాడు.. జీన్స్ వేసుకుని ఎందుకు వెళ్లావు అని. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన పుష్ప తన భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
కుటుంబసభ్యులు గమనించి వెంటనే అతడిని ధన్‌బాద్ పీఎంసీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడి తండ్రి కర్ణేశ్వర్ తుడు మాట్లాడుతూ, జీన్స్ ధరించడంపై తన కొడుకు, కోడలు గొడవ పడ్డారని చెప్పారు. ఈ తగాదాలో నా కోడలు నా కొడుకును కత్తితో పొడిచి చంపేసింది' అని అతడు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com