Jr.NTR ఫ్యాన్‌ శ్యామ్‌మృతిపై వీడని అనుమానాలు..

Jr.NTR ఫ్యాన్‌ శ్యామ్‌మృతిపై వీడని అనుమానాలు..
సూసైడ్‌కు ముందు శ్యామ్‌ మాట్లాడినట్లుగా ఉన్న సెల్ఫీ వీడియోలో మరోవ్యక్తి మాటలు కూడా వినిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సంచలనం రేపిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ శ్యామ్‌మృతిపై ఇంకా అనుమానాలు వీడలేదు. సూసైడ్‌కు ముందు శ్యామ్‌ మాట్లాడినట్లుగా ఉన్న సెల్ఫీ వీడియోలో మరోవ్యక్తి మాటలు కూడా వినిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.శ్యామ్‌ చనిపోయే ముందు 24న ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడాడనే వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విభేదాలు ఉన్నాయా, ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన రాసుకున్న పలు కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. శ్యామ్‌ మృతిపై తల్లిదండ్రులు,సోదరి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.





ఇక శ్యామ్ తన ఇంటిలో కుర్చీ మీద నిలబడి ఉరి వేసుకొన్నట్టు కనిపించింది. అయితే అతని బాడీ మోకాలి వరకు నేలపై ఉంది.చేతికి బలమైన గాయం ఉంది.నోట్ల గంజాయి పెట్టినట్టు కనిపిస్తున్నది. అలాగే జేబులో గంజాయి ప్యాకెట్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.అయితే అంత తక్కువ ఎత్తులో ఉరివేసుకుంటే ఎలా చనిపోతాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.అంతే కాదు శ్యామ్‌ సెల్ఫీ వీడియోలో కూడా వెనుక నుంచి వినిపిస్తున్న గొంతుపైన కూడా పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదు.ఇక శ్యామ్‌ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు.అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే చదువుకొన్నాడని ఉద్యోగం అంటేనే ఇంట్రెస్ట్ లేదనే మాట ఎప్పుడూ రాలేదని,చావు గురించి కూడా ఎత్తలేదు అని శ్యామ్ కుటుంబ సభ్యులు ఆవేదన అవ్యక్తం చేస్తున్నారు.




మరోవైపు ఏపీలో జగన్‌ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య ఆరోపించారు.ప్రతీరోజు హత్యలు, దోపిడీలు,దళిత, వెనుకబడిన వర్గాలపై ప్రతిరోజు జరిగే దారుణాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.శ్యామ్ ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ హత్యే అని అన్నారు.దర్యాప్తు సరిగా చేయకుండా, దర్యాప్తు పూర్తికాకముందే అది ఆత్మహత్య అని జిల్లా ఎస్పీతో సహా పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు.పోలీసులు శ్యామ్ మాట్లాడిన ఒరిజినల్ వీడియోను ఇంత వరకు స్వాధీనం చేసుకోకపోవడం ఏమిటని ఆ ఒరిజినల్ వీడియో వైసీపీలోని ఏ స్థాయి నాయకుడి వద్ద ఉందని నిలదీశారు.

Tags

Next Story