Pontharani News: జస్టిస్ ఫర్ పొన్ తరాణి.. తమిళనాడును కదిలించిన లైంగిక వేధింపుల ఘటన..

Pontharani News (tv5news.in)
Pontharani News: తల్లి, తండ్రి, గురువు.. ఆ తర్వాతే దైవం అంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా గురువు అనేవారిని నమ్మి పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపిస్తారు. కానీ విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఎంతోమంది గురువులు తప్పుదోవ పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలపై అఘాయిత్యానికి ఎగబడుతున్నారు. ప్రపంచాన్ని నడిపించే గురువే ఇలా చేస్తే.. ఇక ఈ ప్రపంచం ఎటు వెళ్తుందని తమిళనాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 12వ క్లాస్ చదువుతున్న పొన్ తరాణి ఆత్మహత్య తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది.
కొయంబత్తూరులోని కొట్టాయిమేడులో నివసించే మగుదేశ్వరన్ కుమార్తె పొన్ తరాణి. తను చిన్మయ విద్యాలయ మ్యాట్రికులేషన్ స్కూల్‌లో ప్లస్ 2 చదువుతోంది. అక్కడ మిథున్ చక్రవర్తి అనే టీచర్ తనను లైంగాకంగా వేధిస్తున్నాడని కొన్నిరోజుల క్రితం తన తల్లిదండ్రులకు చెప్పింది పొన్ తరాణి. ఈ విషయం తెలుసుకోగానే వారు తనను స్కూలు మార్చేశారు. అయినా కూడా పొన్ తరాణి మనసులో ఈ విషయం బలంగా ముద్రపడిపోయింది.
రెండ్రోజుల క్రితం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొన్ తరాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్యకు తనను వేధించిన టీచరే కారణమని ఉక్కడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా తమ కూతురు ఆ స్కులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్ కూడా రాసినట్టు వారు తెలిపారు. దీంతో పోలీసులు మిథున్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
మిథున్‌ను కస్టడీలోకి తీసుకుంటే చాలదని.. ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న పొన్ తరాణి మృతికి కారణమయిన అలాంటి కీచకుడికి తగిన శిక్ష వేయాలని తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆ స్కూలు యాజమాన్యానికి కూడా తగిన శిక్ష పడాలని బొన్ తారాణి తల్లిదండ్రులు, బంధువులు విన్నవిస్తున్నారు. 'జస్టిస్ ఫర్ పొన్ తరాణి' అని తమిళనాడులో ఆందోళనలు దద్దరిల్లుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com