lemon fraud: నిమ్మకాయల స్కామ్.. జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్

Lemon Fraud: కపుర్తలా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గుర్నామ్ లాల్‌పై వివిధ ఆరోపణలు వస్తుండడంతో జైళ్ల మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఈరోజు సస్పెండ్ చేశారు. జైలు ఖైదీల కోసం ఉద్దేశించిన నిమ్మకాయలను వారికి ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపించి అడ్డంగా బుక్కయ్యారు. డీఐజీ నేతృత్వంలోని బృందం జైలులో జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి.
ఖైదీల కోసం అర క్వింటాల్ నిమ్మకాయలు ఆర్డర్ చేసినా అవి వారికి చేరలేదు. జైలు రికార్డులు కొనుగోలు చేసినట్లు చూపుతుండగా, ఖైదీలు తమకు నిమ్మకాయలు ఇవ్వలేదని తనిఖీ బృందానికి చెప్పారు. దేశంలో నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ఈ స్కామ్ వెలుగు చూసింది. ఖైదీల కోసం ఉద్దేశించిన ఆహారం కూడా తగ్గించి ఇస్తున్నట్లు బృందానికి తెలియజేశారు.
జైళ్ల పోలీసు ఏడీజీపీ వరీందర్ కుమార్ మాట్లాడుతూ: "జైలు ఖైదీలకు సరైన ఆహారం అందించడంలో విఫలమైన కారణంగా సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. డీఐజీ ఆధ్వర్యంలోని బృందం అక్రమాలపై తనిఖీలు నిర్వహించింది. కపుర్తలా జైలులోని ఖైదీలకు నిబంధనల ప్రకారం సరైన ఆహారం అందడం లేదని తేలింది. గోధుమలు, రోటీలు, పప్పులు మొదలైన వాటిని ఖైదీలకు సరిగా అందడం లేదని తెలుసుకున్నారు. జైలు ఖైదీలకు ఆహారం ఇచ్చేటప్పుడు ప్రత్యేక నిబంధన పాటించాలి. అది పాటించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com