karimnagar : వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్..!

karimnagar : వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్..!
మాలతి ఏడు నెలల గర్భవతి, కడుపునొప్పి ఉందని తన భర్త నరోత్తంరెడ్డితో కలిసి కరీంనగర్ లోని మాతా శిశు సంరక్షణా కేంద్రానికి‌ వచ్చారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాలతి ఏడు నెలల గర్భవతి, కడుపునొప్పి ఉందని తన భర్త నరోత్తంరెడ్డితో కలిసి కరీంనగర్ లోని మాతా శిశు సంరక్షణా కేంద్రానికి‌ వచ్చారు. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని, ఒక శిశువు బ్రతికే అవకాశం లేదని చెప్పారు. ఇందుకోసం గర్భసంచికి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం మాలతిని అపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళి గర్భసంచికి కుట్లు వేయాల్సి ఉంది.

అయితే ఇక్కడే డాక్లర్ల నిర్లక్ష్యం బయటపడింది. వైద్యులు మాలతి కేస్ షీటుకు బదులుగా మరో మహిళ కేస్ షీట్‌ను తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు..ఈ క్రమంలోనే మాలతి పొట్ట కోశారు....ఇంతలో తేరుకున్న మాలతి గట్టిగా అరుస్తూ అస్సలు విషయం చెప్పింది. అనంతరం తేరుకున్న వైద్యులు కట్‌చేసిన పొట్టకి కుట్లు వేశారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే తల్లి బిడ్డలకి పెద్ద ప్రమాదం జరిగేదని ఆమె బంధువులు అంటున్నారు, నిర్లక్ష్యం గా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమ్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story