అప్పులు తీర్చలేక ముగ్గురు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య..

అప్పులు తీర్చలేక ముగ్గురు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య..
కర్ణాటకలోని తుమకూరు నగరంలోని ఓ ఇంట్లో ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

కర్ణాటకలోని తుమకూరు నగరంలోని ఓ ఇంట్లో ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. చేసిన అప్పులు తీర్చలేక, వారు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఘటనకు పాల్పడేముందు తాము ఈ లోకాన్ని విడిచి వెళుతున్నామని వీడియో తీసి మరీ బంధువులకు పంపారు. తమ మరణానికి ఇరుగుపొరుగు, అప్పులే కారణమంటూ దంపతులు రెండు పేజీల డెత్ నోట్ కూడా వీడియోలో ఉంచారు.

మృతులను గరీబ్ సాబ్ (42), సుమయ్య (35), వారి పిల్లలు హజీరా (14), సుభాన్ (10), మునీర్ (8)గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ఆధారంగా, గరీబ్ సాబ్, అతని భార్య వారి ప్రాణాలు తీసుకునే ముందే తమ ముగ్గురి పిల్లల ప్రాణాలు తీశారు.

వీడియోలో, గరీబ్ సాబ్ తన పొరుగువారితో పాటు మరో నలుగురిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. విషాదానికి వారిని బాధ్యులను చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వరకు లేఖ రాశారు. గరీబ్ సాబ్ ఒక సంస్థ నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి చెల్లించలేకపోయాడని సమాచారం. ఆ ప్రాంతంలో కబాబ్ దుకాణం నడిపేవాడు. డెత్ నోట్ ఆధారంగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story