Karthikadeepam Effect: వేలు "కొరికిన" కార్తీకదీపం సీరియల్‌

Karthikadeepam Effect: వేలు కొరికిన కార్తీకదీపం సీరియల్‌
X
సీరియల్‌ చూస్తుండగా అడ్డొచ్చాడని వ్యక్తి వేలు కొరికిన షాపు యజమాని

మగవాళ్లు కూడా టీవీ సీరియల్‌ లవర్స్‌గా మారిపోతున్నారు. సీరియల్ చూస్తున్నప్పుడు మధ్యలో వేలు పెట్టాడని ఓ వ్యక్తి వేలు కొరికేశాడు ఓ షాపు యజమాని. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు చెందిన మొగిలి గ్రామంలో కిరాణా, బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వెంకటయ్య బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం అయిపోవడంతో మరో బాటిల్ కావాలని వెంకటయ్య అడిగాడు. కార్తీక దీపం సీరియల్ చివరి ఎపిసోడ్ వస్తుండటంతో అందులో లీనమయ్యాడు మొగిలి. ఇంతలో వెంకటయ్య మద్యం కోసం కేక వేయడంతో మొగిలి అసహనానికి గురయ్యాడు. వెంకటయ్య కుడి చేతి చూపుడు వేలును కొరికాడు.దీంతో రక్తం కారుతున్న వెంకటయ్య కేకలు వేశాడు. మొగిలి నిర్వాకంపై పోలీసులకు మరుసటి రోజు వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన మొగిలిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. పోలీసులు వెంకటయ్యపై ఎందుకు దాడి చేశావని అడిగితే కార్తీక దీపం చివరి ఎపిసోడ్ వస్తుండగా ఆసక్తిగా చూస్తున్నానని ఇంతలో అతడు కేకలు వేయడంతో కోపం పెరిగిందని అందుకే అతడి వేలు కొరికానని చెప్పడంతో పోలీసులు అవాక్కైయ్యారు.

Tags

Next Story