Kerala : కేరళ సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరెస్ట్

Kerala : కేరళ సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరెస్ట్
లైఫ్ మిషన్ కుంభకోణంలో, కేరళ సీఎం పినరయ్ విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం శివశంకర్ లంచం తీసుకున్నారని ED అరెస్ట్ చేసింది


కేరళ సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీని అరెస్ట్ చేసింది ఈడీ (Enforcement Directorate). లైఫ్ మిషన్ కుంభకోణంలో, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం శివశంకర్ లంచం తీసుకున్నారని ED అరెస్ట్ చేసింది. మూడు రోజుల విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. లైఫ్ మిషన్ అనేది కేరళ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్, దీని ద్వారా నిరాశ్రయులైన వారికి గృహాలు నిర్మించబడతాయి.

UAE కాన్సులేట్ ద్వారా రెడ్ క్రెసెంట్ అనే స్వచ్చంద సంస్థ పేదవారికి ఇళ్లను కట్టడానికి రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఇందులోని రూ.14.50 కోట్లను వెచ్చించి లైఫ్ మిషన్ పథకం ద్వారా త్రిసూర్ లోని వడక్కంచెరి ప్రాంతంలో 140 కుటుంబాలకు ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రాక్ట్ లో మిగిలిన మొత్తాన్ని ఆసుపత్రి నిర్మాణానికి వినియోగిస్తామని కూడా చెప్పారు. ఇళ్లు కట్టడానికి.. 'యునిటాక్' (UNITAC) బిల్డర్స్ కు నిర్మాణ కాంట్రాక్ట్ ను ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం సదరు అధికారులకు రూ.4.48 కోట్ల లంచం ఇచ్చినట్లు యూనిటాక్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ ఈపెన్ తెలిపారు. ప్రభుత్వం ఈ కేసుపై విచారణకు ఆదేశించింది. స్వప్న, సరిత్, సందీప్ నాయర్, పీఎస్ శివశంకర్ కు ఇందులో పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన ఈడీ నిందితులను అరెస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story