అనుమానంతో సహజీవనం చేస్తున్న ఆమెను..

అన్ని రోగాలకంటే పెద్ద జబ్బు అనుమానం. అదే ఆమెపై అతడికి కోపాన్ని పెంచింది. బెంగళూరులో 24 ఏళ్ల మహిళ తనను మోసం చేసిందని అనుమానించిన ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటన నగరంలోని బేగూర్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, కేరళకు చెందిన 24 ఏళ్ల వైష్ణవ్, దేవా గత మూడేళ్లుగా బెంగళూరులో కలిసి నివసిస్తున్నారు."కొన్ని రోజుల క్రితం, అతనికి (నిందితుడు) మహిళ (మరణించిన)పై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇద్దరూ ప్రతి రోజు ఆ విషయంపై గొడవ పడేవారు. నిన్న ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఆమె నెత్తి మీద కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో ఆమె తలకు తీవ్ర రక్తస్రావం అయి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com