Kerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన భర్త..

Kerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన భర్త..
Kerala Vismaya Death: వాళ్లిద్దరినీ చూసి చూడముచ్చటగా ఉంది జంట అని పెళ్లికి వచ్చిన బంధువులంతా అనుకున్నారు..

Kerala Vismaya Death: వాళ్లిద్దరినీ చూసి చూడముచ్చటగా ఉంది జంట అని పెళ్లికి వచ్చిన బంధువులంతా అనుకున్నారు..కూతుర్ని డాక్టర్ చదివించిన తండ్రి గవర్నమెంట్ సర్వీసులో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాడు.. కట్నకానుకలు ఘనంగానే సమర్పించాడు.. అయినా అతడికి సరిపోలేదు.. కట్నం కోసం ప్రతి రోజూ వేధించేవాడు.

పెళ్లయి ఏడాది కూడా కాలేదు.. నాన్నా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను.. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లు.. అని అంటే కూడా తండ్రి సర్థిచెప్పాడు.. కూతురు సంసారం చక్కబడుద్దనుకున్నాడు.. కానీ అంతలోనే ఆమె భర్త వేధింపులు భరించలేక అత్మహత్య చేసుకుంది.. ఇది జరిగి ఏడాది అయింది. కేరళలో జరిగిన ఈ సంఘటనకు దేశం యావత్తుని కలిచి వేసింది. సంవత్సర కాలంగా కొనసాగుతున్న ఈ కేసులో భర్తని దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది కొల్లం లోని అదనపు సెషన్స్ కోర్టు.

వరకట్న వేధింపుల ఆరోపణలు రుజువవడంతో అతడిని గవర్నమెంట్ సర్వీస్ నుంచి తొలగించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ తన 22 ఏళ్ల భార్య విస్మయను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో దోషిగా తేల్చింది కోర్టు. కొల్లంలోని అదనపు సెషన్స్ కోర్టు సోమవారం ఉదయం సమావేశమైన వెంటనే తీర్పును వెలువరించింది.

ఈ తీర్పుతో కిరణ్ బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. విస్మయ జూన్ 21న కొల్లాం జిల్లాలోని శాస్తంకోటలో కిరణ్ కుమార్ ఇంటి బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. జూన్ 22న కుమార్‌ను అరెస్టు చేశారు. 2022 మార్చిలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

అతనిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 498A (కట్నం కోసం స్త్రీని హింసించడం) మరియు 304B (కట్నం మరణం) కింద కేసు నమోదు చేశారు. విస్మయ పందళంలోని మన్నం ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS)లో నాల్గవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఆమెకు మే 31, 2020న కిరణ్ కుమార్‌ తో వివాహం జరిగింది.

విస్మయ వరకట్న వేధింపులకు గురైందని ఆమె తల్లిదండ్రులు, సోదరులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. భర్త కుమార్ నేరారోపణలో కీలకమని నిరూపించారు. తమ కుమార్తె విస్మయను భర్త ఎక్కువ కట్నం డిమాండ్ చేసి చిత్రహింసలకు గురిచేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. విస్మయ తల్లితండ్రులు ఇచ్చిన కొత్త కారు, బంగారు ఆభరణాల సెట్ కిరణ్ కు నచ్చలేదు. దాంతో ప్రతి రోజు ఆమెను వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు.

ఇందుకు సాక్ష్యంగా విస్మయ తండ్రికి ఫోన్ చేసిన వాయిస్ మెసేజ్ లు వినిపించారు. తన భర్త ఇంట్లోనే ఉంటే ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని, అందుకే ఇక అక్కడ ఉండలేనని విస్మయ తన తండ్రికి చెప్పింది. పోలీసుల విచారించి కిరణ్‌ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం అతడిని సర్వీసు నుంచి తొలగించింది.

నాలుగు నెలల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. విస్మయ మృతి చెందిన 11 నెలల రెండు రోజుల తర్వాత తీర్పు వెలువడనుంది.

Tags

Read MoreRead Less
Next Story