Hyderabad : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు
Hyderabad : హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న.. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండకు చెందిన వంశీకృష్ణ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిన్న ఉదయం క్లాస్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీనిపై ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించడంతో.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి పుస్తకాల సంచిలో పోలీసులకు రెండు ఆత్మహత్య లేఖలు లభించాయి. వీటిలో ఒకటి తెలుగులో ఉంది.
దీనిలో 'నేను లైంగికంగా వేధించబడ్డా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా' అని ఉంది. ఇంగ్లీష్‌లో రాసిన మరో లేఖలో 'బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా' అని రాసి ఉంది. వీటి ఆధారంగా కేసును ఒక కొలిక్కి తెచ్చే పనిలో పడ్డారు పోలీసులు.
అయితే వంశీకృష్ణ తల్లిదండ్రులు మాత్రం దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com