మానసిక రోగి ఘాతుకం: తల్లి, భార్య, ముగ్గురు పిల్లలను చంపి
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తన తల్లి మరియు భార్యను చంపి, ఆపై తన ముగ్గురు పిల్లలను ఇంటి పైకప్పుపై నుండి విసిరి ఆత్మహత్యకు పాల్పడు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారనే వార్త ఆ ప్రాంతంలో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడ గుమిగూడారు. ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దావానంలా వ్యాపించింది. .
ఈ సంఘటన శుక్రవారం పాలపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, మానసిక వ్యాధిగ్రస్తుడని భావించిన వ్యక్తి తన తల్లిని కాల్చి చంపాడు. అతని భార్యను సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత అతను తన ముగ్గురు పిల్లలను ఇంటి పైకప్పుపై నుండి విసిరి, వారందరినీ చంపాడు. తన కుటుంబంలోని ఐదుగురిని పై లోకాలకు పంపించిన తరువాత, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు మద్యానికి బానిసై మానసికంగా కుంగిపోయాడని పోలీసులు తెలిపారు.
పాలపూర్ గ్రామం నుండి ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు.
మానసిక రోగి అనురాగ్ సింగ్ (౪౫) 40 సంవత్సరాల వయస్సు గల అతని భార్యను, అతని తల్లిని (౬౫) చంపినట్లు పోలీసులు కనుగొన్నారు. అతని 12, తొమ్మిది మరియు ఆరేళ్ల వయస్సు గల ముగ్గురు పిల్లలను మేడ పై నుంచి తోసి చంపేశాడు.
ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com