భార్యభర్తల మధ్య గొడవ.. బావమరిదికి కత్తిపోట్లు!

భార్యభర్తల మధ్య గొడవ.. బావమరిదికి కత్తిపోట్లు!
భార్యభర్తల మధ్య గొడవ కారణంగా బామ్మర్ధి కత్తిపోట్లకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో ఈ దారుణం జరిగింది.

భార్యభర్తల మధ్య గొడవ కారణంగా బామ్మర్ధి కత్తిపోట్లకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో ఈ దారుణం జరిగింది. తమిళనాడు రాష్ట్రం పెరంబూర్‌కు చెందిన శాంతకు 12 ఏళ్ల క్రితం శాంతిపురం మండలం నారసింహాపల్లికి చెందిన నారాయణస్వామితో వివాహం జరిగింది.

బెంగుళూర్‌లో పెయింటర్‌గాపని చేసే నారాయణ స్వామి లాక్‌డౌన్‌నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు దండికుప్పం హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్యగొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో.. భార్యశాంతి అలిగి పుట్టింటికి వెళ్లి పోయింది.

అయితే హాస్ట్‌లోఉండి చదువుకుంటోన్న తన కొడుకులను చూసేందుకు శాంత.. తన అన్న దినేష్‌, వదిన దుర్గతో కలిసి దండికుప్పంకు వచ్చింది. విషయం తెలుసుకున్న నారాయణ స్వామి హాస్టల్‌ వద్దకు వచ్చి భార్యతో గొడవ పడ్డాడు.

అడ్డొచ్చిన బావమరిదిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ దినేష్‌ను చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య శాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story