Khammam : కృష్ణయ్య హత్య కేసులో పరారీలో ఉన్న అతనే ఏ1..

Khammam : కృష్ణయ్య హత్య కేసులో పరారీలో ఉన్న అతనే ఏ1..
Khammam : కృష్ణయ్య హత్యకేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Khammam : ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసుపై తమ్మినేని నవీన్ రూరల్ పోలీసులు కు ఇచ్చిన పిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులుఎనిమిది మంది నిందితులను ఖమ్మం రెండవ అడిషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ మౌనిక ఎదుట హాజరుపర్చారు.నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. భారీ పోలీసు బందోబస్తు మధ్య జైలుకు తరలించారు.నిందితులపై ఐపీసీ148 ,341 ,132 ,302, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది

ఇక కృష్ణయ్య హత్యకేసులో ప్రధాన నిందితులు బోడబట్ల శ్రీను, గజ్జి కృష్ణస్వామి కన్నెగంటి నవీన్,మాకరపు లక్ష్మియ్య, బండారు నాగేశ్వరావు, షేక్‌ రంజాన్, నూకల లింగయ్య,జక్కంపూడి కృష్ణయ్యలను రిమాండ్‌కి తరలించారు. అయితే ఏ1 ముద్దాయిగా ఉన్న కోటేశ్వరరావు ఇంకా పరారీలో ఉన్నాడు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు. అయితే నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి తిరస్కరించారు.

మరోవైపు ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు,పరారీలో ఉన్నారు. నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.కృష్ణయ్య మర్డర్ పక్కా రాజకీయ కోణంలోనే జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.మర్డర్ కు స్కెచ్ వేసిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు స్పెషల్ టీమ్ లు గాలిస్తున్నాయి.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా మండ‌ల ప‌రిధిలోని పొన్నెక‌ల్ రైతు వేదిక వ‌ద్ద జాతీయ జెండాను కృష్ణయ్య ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న త‌న కారు డ్రైవ‌ర్ ముత్తేశంతో బైక్‌పై తెల్దారుప‌ల్లికు తిరిగి వ‌స్తుండ‌గా. గ్రామ స‌మీపంలో బైక్‌ను ఆటోతో ఢీకొట్టారు. కింద ప‌డ్డ కృష్ణ‌య్యపై దుండ‌గులు వేట కొడ‌వ‌ళ్లు, గొడ్డళ్లు, క‌త్తుల‌తో విచ‌క్షణార‌హితంగా దాడి చేశారు. దీంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు కృష్ణయ్య.ఎఫ్‌ఐఆర్‌లో 8మంది నిందుతుల పేర్లు చేర్చగా... ప్రధాన నిందితుడు కోటేశ్వరరావు పరారీలో ఉన్నారు. ఆయుధాలు సమకూర్చిన వారిని కూడా అరెస్ట్‌ చేసిన పోలీసులు...హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story