'దోసెపిండి' అవమానం.. పోయిన ప్రాణం

దోసెపిండి అవమానం.. పోయిన ప్రాణం

తోటికోడలు అవమానించింది. దానికి తోడు భర్తతో గొడవ. ఆమె భరించలేకపోయింది దాంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల కోటపేట కాలనీలో జరిగింది. మాబాషా, షాకీరాబీ దంపతులు అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఉదయం షాకీరాబీ దోశ పిండి గ్రైండ్ పట్టించుకుని ఇంటికి వచ్చింది. పిండిని చూసిన తోడికోడలు షాకీరాబీతో కోపంగా ఈ పిండి అచ్చం నీలాగే ఉందంటూ ఎద్దేవా చేసింది.

దాంతో షాకీరాబీ అవమానంగా భావించింది. మళ్లీ కొద్ది సేపటికే భర్త టిఫిన్ విషయంలో భార్య షాకీరాబీతో గొడవ పడ్డాడు. అటు తోడికోడలు, ఇటు భర్త ఇద్దరూ అవమానించారాని మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకని ప్రాణాలు తీసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మ‌ృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story