Lakshmipathi Drugs Case: డ్రగ్స్ వల్ల చనిపోయిన బీటెక్ విద్యార్థి కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్..

Lakshmipathi Drugs Case: డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న లక్ష్మిపతిని పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ విద్యార్ధి మృతికి కారణమైన కేసులో లక్ష్మిపతిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిపతి గత 5 రోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. డ్రగ్స్‌కేసులో లక్ష్మిపతి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడు.
బీటెక్ పూర్తి చేసిన తర్వాత గోవా నుంచి డ్రగ్స్ తెప్పించడం మొదలుపెట్టిన ఇతను.. కాలేజీ విద్యార్ధులకు మత్తుపదార్ధాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గోవా, ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తెప్పిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్,డిగ్రీ, బీటెక్ తోపాటు సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్‌కు సరఫరా చేసినట్లు పోలీసులు తేల్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com