Lawrence Bishnoi : గ్యాంగ్ స్టర్లకు, పోలీసులకు మధ్య కాల్పులు

Lawrence Bishnoi : గ్యాంగ్ స్టర్లకు, పోలీసులకు మధ్య కాల్పులు
X
ఆగ్రా నుంచి జైపూర్ కు తీసుకువెళ్తుండగా కాల్పులు...

పోలీసులకు గ్యాంగ్ స్టర్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. సోమవారం అర్థరాత్రి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను పోలీసులు ఆగ్రా నుంచి జైపూర్ కు తీసుకువెళ్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. గార్డుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపారు దుండగులు. అప్రమత్తమైన పొలీసులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్ స్టర్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.


జనవరి 27న లారెన్స్ బిష్టోయ్ ముఠాకు చెందిన కీలకమైన గ్యాంగ్ స్టర్ ను పంజాబ్ యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 30క్యాలిబర్ పిస్టల్ తో పాటు, ఆరు లైవ్ కాట్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్ చైనా నుంచి దిగుమతి అయినట్లు గుర్తించారు. రాజ్ వీర్ సింగ్ అలియాస్ రవి రాజ్ గర్ అనే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాల మేరకు నేరాలు చేస్తుంటాడని పోలీసులు చెప్పారు.

Tags

Next Story