Lawrence Bishnoi : "ఢిల్లీలో కలువు, ఏకే 47తో లేపేస్తా"

Lawrence Bishnoi : ఢిల్లీలో కలువు, ఏకే 47తో లేపేస్తా
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా భద్రతను తగ్గించిన తర్వాత కాల్చి చంపబడ్డాడు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే సంజయ్ రౌత్‌ను హిందూ వ్యతిరేకిగా పేర్కొన్నాడు నిందితుడు. "తు ఢిల్లీ మే మిల్, తుఝే ఏకే-47 సే ఉదా దుంగా. తేరా భీ మూసేవాలా హో జాయేగా. (నన్ను ఢిల్లీలో కలవు, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. నువ్వు కూడా సిద్దూ లాగే అవుతావు )," అని బెదిరించాడు. సంజయ్ రౌత్, సల్మాన్ ఖాన్‌లను చంపుతానని పేర్కొన్నాడు. "సల్మాన్ ఔర్ తు ఫిక్స్,". కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి పూణెలో నిందితుడిని అరెస్ట్ చేశారు.

"ఈ ప్రభుత్వం (ఏక్‌నాథ్ షిండే) అధికారంలోకి వచ్చిన తర్వాత, మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించారు, ఈ విషయం గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు, గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు. మేము హోం మంత్రిత్వ శాఖ తెలియజేసినప్పుడు.. వారు దీనిని మేము కావాలనే చేస్తున్నామని అంటారు, ”అని సంజయ్ రౌత్ అన్నారు.

"మాకు నిజం తెలుసు, కానీ మేము మౌనాన్ని పాటించాలి. బెదిరింపు గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. హోం మంత్రి ఏమి చేసాడు? నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి" అని సంజయ్ రౌత్ అన్నారు.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా భద్రతను తగ్గించిన తర్వాత కాల్చి చంపబడ్డాడు. ఈ హత్యకు.. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ బాధ్యత వహించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జైలు నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడు బిష్ణోయ్. కృష్ణజింకను చంపిన కేసులో బిష్ణోయ్‌ సంఘం సల్మాన్ ఖాన్ పై కోపంగా ఉన్నట్లు సమాచారం. 1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేతో కలిసి రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణజింకలను కాల్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story