వామన రావు దంపతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు

వామన రావు దంపతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. న్యాయవాది నాగమణి, డీసీపీ మధ్య సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. తమకు, గుడికి.. రక్షణ కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ముందు నుంచి ఆరోపించిన దంపతుల మాటలు నిజమేననడానికి ఆడియో సాక్ష్యంగా మారింది.
కుంట శ్రీను నుంచి ప్రమాదం ఉందని.. రక్షణ కల్పించాలని కోరడం ఆడియోలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, తమకు రక్షణ కల్పించాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని నాగమణి చెప్పడం, ప్రతిదీ పోలీస్‌తో కాదు కదా అంటూ డీసీపీ అనడం కూడా రికార్డుల్లో ఉంది.
ఆడియోలో ఉన్న దాని ప్రకారం.. వామనరావు స్వగ్రామం గుంజపడుగులోని రామాలయం వివాదంపై పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వామనరావు భార్య, న్యాయవాది నాగమణి గుడికి, తమకు రక్షణ కల్పించాలని డీసీపీ రవి కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసి కోరగా స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com