Rajasthan: 8మంది పిల్లలను వదిలేసి.. 4గురు పిల్లలున్న వ్యక్తితో ప్రేమ, పెళ్లి

Rajasthan: 8మంది పిల్లలను వదిలేసి.. 4గురు పిల్లలున్న వ్యక్తితో ప్రేమ, పెళ్లి
Rajasthan: ఎటో వెళ్లిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు అని పాడుకునే వయసు కూడా కాదు వాళ్లిద్దరిదీ..

Rajasthan: ఎటో వెళ్లిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు అని పాడుకునే వయసు కూడా కాదు వాళ్లిద్దరిదీ..పైగా ఆమెకేమో 8మంది పిల్లలూ, భర్త ఉన్నారు.. అతడికేమో 4 గురు పిల్లలున్నారు కానీ భార్య లేదు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయారు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఈ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 8 మంది పిల్లల తల్లి 4గురు పిల్లలున్న తండ్రితో ప్రేమలో పడింది. భర్తను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయింది. అమ్మ తమని వదిలేసి వెళ్లిపోయిందని తెలుసుకున్న పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. అయినా ఆమె గుండె కరగలేదు.. చివరికి కోర్టు కూడా ప్రేమికుడితో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.

ప్రేమకు వయస్సు లేదని అంటారు. ప్రేమ ఎవరికైనా ఎప్పుడైనా పుట్టొచ్చు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసిన ఆషికి ఉదంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 8 మంది పిల్లల తల్లి 4 పిల్లల తండ్రితో ప్రేమలో పడి భర్త, పిల్లలను వదిలి పారిపోయింది.

ఆశ్చర్యకరంగా, పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా ఆమె అదే విషయం చెప్పింది - నేను వెళ్లి నా ప్రేమికుడితో ఉండాలనుకుంటున్నాను అని ఖరాఖండిగా చెప్పేసరికి కోర్టు కూడా అందుకు ఒప్పుకోవలసి వచ్చింది. ఆమె తన ప్రేమికుడితో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.

పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు, కానీ తల్లి గుండె కరగలేదు..

శనివారం పోలీసులు ఆమెను, ఆమె ప్రేమికుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో, మహిళ భర్త తన 8 మంది పిల్లలతో కోర్టుకు చేరుకున్నాడు. ఇంటికి తిరిగి రావాలని పిల్లలు తల్లిని వేడుకుంటుండగా, భర్త కూడా ఆమెను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. కానీ ఆమె హృదయం కరగ లేదు. ప్రతి ఒక్కరూ ఇది పద్దతి కాదని వివరించారు. తల్లి లేని పిల్లలు అన్యాయమైపోతారని కుటుంబం మొత్తం ఆమెకు చెప్పి చూసింది.

అయినా ఆ మహిళ తన భర్త, పిల్లలతో తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. పిల్లలు ఏడుస్తూ తల్లివైపే చూస్తున్నారు. కానీ ఆ మహిళ చలించలేదు. కోర్టు తన ఇష్టానుసారం వ్యవహరించే హక్కు ఆమెకు ఉందనడంతో, చివరకు ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనుకుంటున్నానని న్యాయమూర్తికి తెలిపింది. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించేందుకు కోర్టు అనుమతించింది. ఈ విషయం కోర్టు కారిడార్‌లో రోజంతా చర్చనీయాంశమైంది.

భరత్‌పూర్‌లోని కమాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఫక్రు తన భార్య సుహానిని గ్రామానికి చెందిన సాహున్ (58) కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఏప్రిల్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో గ్రామ పెద్ద పంచాయితీ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో సాహున్ తాను ఫక్రు భార్యను తిరిగి అతడికి అప్పజెబుతానని పంచాయితీ పెద్దల ముందు ప్రమాణం చేశాడు. కానీ ఆమె భర్త దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు. ప్రేమికుడు సాహున్ తోనే ఉండాలనుకుంది. దీంతో పంచాయతీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది.

ఫక్రు, సాహునీకి మొత్తం 14 మంది పిల్లలు. వీరిలో ఆరుగురు బాల్యంలోనే చనిపోయారు. ఇప్పుడు ఆమెకు 8 మంది పిల్లలు మిగిలారు. వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అమ్మమ్మ అయినా ప్రేమలో పడింది. అదే సమయంలో ఆమె ప్రేమించిన సాహున్ కి కూడా నలుగురు పిల్లలు ఉన్నారు. అతడి భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. నలుగురు పిల్లలకి పెళ్లిళ్లు అయ్యాయి. తాతయ్య కూడా అయ్యాడు. అయినప్పటికీ అతను 8 మంది పిల్లల తల్లితో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story