Nalgonda : బహిరంగ సభలో విద్యార్ధులపై పడ్డ ఎల్‌ఈడీ స్క్రీన్..

Nalgonda : బహిరంగ సభలో విద్యార్ధులపై పడ్డ ఎల్‌ఈడీ స్క్రీన్..
Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది

Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఎల్‌ఈడీ స్క్రీన్ విద్యార్థులపై పడింది గాయపడిన విద్యార్థులను పోలీసుల వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో విద్యార్థులచే పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం NSP క్యాంప్ గ్రౌండ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. అయితే సడన్‌గా ఎల్‌ఈడీ స్క్రీన్ విద్యార్థులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు పరుగులు తీశారు. తమ పిల్లలకు ఏమైందో అని టెన్షన్ పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story